జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల అందజేత

 


ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అదిలాబాద్ జిల్లా పార్లమెంటు సభ్యులు సోయం బాబూరావు జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం  శాంతి నగర్ లోనిస్థానిక ప్రగతి విద్యాలయములో పాత్రికేయ మిత్రులకు నిత్యావసర సరుకులు పంపిణీచేస్తున్నామని ఎంపీ సాయం బాపురావు అన్నారు ఈ సందర్భంగా ఎంపీ సోయం బాబూరావు మాట్లాడుతూ కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు ప్రజలను చైతన్యవంతుల్ని చేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.   ప్రధాని  నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో తెలంగాణ ప్రజలు తు.చ.తప్పకుండా  పాటించడం పూర్తిగా నిర్భందంలో ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు.  ప్రజలు ఇలా ఇలాగే లాక్ డౌన్లోడ్ లాక్ డౌన్ సహకరిస్తే ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రగతి విద్యాలయం చైర్మన్ ప్రగతి విద్యాలయ సంస్థల చైర్మన్ వకుళాభరణం ఆదినాధ్ బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ నాయకులు పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.