క్వారంటైన్‌లో న‌లుగురు క‌ర్ణాట‌క మంత్రులు

బెంగ‌ళూర్:‌  క‌ర్ణాటకలో నలుగురు మంత్రులు స్వీయ‌నిర్బంధంలోకి వెళ్లిపోయారు.  ఓ జ‌ర్న‌లిస్టుకు క‌రోనా సోక‌డంతో అత‌న్ని క‌లిసిన న‌లుగురు మంత్రులు స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. ఈ జాబితాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వత్ నారాయణ్ ఉన్నారు. బెంగళూరు సిటీలో జర్నలిస్టు ప‌ర్య‌టించ‌గా.. అతనికి ఈ నెల 24వ తేదీన వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. అతను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ, హోం మంత్రి బసవరాజు బొమ్మై, కన్నడ, సాంస్కృతిక శాఖ మంత్రి సీటీ రవి, వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్‌ను క‌లిశారు. దీంతో పాటుగా జర్నలిస్ట్, అతని కుటుంబసభ్యులు, వివిధ మీడియా సంస్థల జర్నలిస్టులతో సహా 40 మందిని  నిర్బంధించినట్లు జ‌ర్న‌లిస్ట్ ప‌నిచేసే సంస్థ తెలిపింది. అయితే నలుగురు మంత్రులు పరీక్ష చేసుకోగా.. నెటివివ్ వచ్చింది. కానీ క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు.