గుజరాత్ లో ఒక్కరోజులోనే భారీగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మంగళవారం సాయంత్రానికి అందిన సమాచారం మేరకు కొత్తగా 226 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. మంగళవారం ఒక్కరోజులోనే కరోనా వల్ల 19 మంది చనిపోయినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ రోజు కరోనా నుంచి 40 మంది కోలుకున్నారని, మొత్తం 434 మంది కోవిడ్-19 నుంచి కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్-19తో 181 మంది మృతి చెందారు. అహ్మదాబాద్ లో  కొత్తగా 164 కరోనా కేసులు నమోదయ్యాయని, 2543 కరోనా కేసుల్లో ఇప్పటి వరకు 128 మంది మృతి చెందారు. గుజరాత్ రాష్ట్రంలో మంగవారం సాయంత్రం నాటికి మొత్తం 3774 కరోనా కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది.