దేశంలో ఒక్కరోజే 478మంది డిశ్చార్జ్
ఒక్కరోజు 38 మంది బలి
మొత్తం 977 మంది మృతి..
ప్రపంచవ్యాప్తంగా 31,06,598 మందికి పాజిటివ్
2,14,642 మంది మృతి..31,358 కరోనా కేసులు..
ఒక్కరోజు 1,825 మందికి పాజిటివ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు 30 వేలు దాటాయి. మంగళవారం 1,825 కొత్త కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 31,358కి చేరింది. మరణాలు వెయ్యికి దగ్గరవుతున్నాయి. ఇప్పటిదాకా 977 మంది చనిపోగా, ఒక్కరోజు 38 మంది కరోనాకు బలయ్యారు. 22,766 యాక్టివ్ కేసులున్నాయి. మంగళవారం 478 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మొత్తంగా 7,615 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలో కేసులు 9 వేలు దాటాయి.మొత్తంగా అక్కడ 9,315 మంది కరోనా బారిన పడగా, 369 మంది చనిపోయారు. ఆ తర్వాత గుజరాత్లో 3,774 మందికి కరోనా సోకగా, 181 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినపడిన వాళ్ల సంఖ్య 31,06,598కి చేరింది. 2,14,642 మంది చనిపోగా, 9,44,593 మంది కోలుకున్నారు. అమెరికాలో ఎక్కువగా 10,22,259 మందికి కరోనా సోకింది. 57,862 మంది చనిపోయారు.