విశాఖపట్నం(ఆరోగ్యజ్యోతి) :కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా భౌతిక దూరం తప్పని సరి అయింది. లాక్‌డౌన్ తర్వాత ప్రజలంతా భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలంటే లక్షల మంది సిబ్బంది కావాలి. కానీ ఆ అవసరం లేకుండా ఏ ఇద్దరు ఒక మీటరు కంటే తక్కువ దూరంలో ఉన్నా.. వెంటనే అప్రమత్తం చేసే లా ‘సూపర్ వ్యూ’ పేరుతో టెక్నాలజీని రూపొందించారు విశాఖ యువత. సీసీ కెమెరాలతో ప్రజలు భౌతిక దూరం పాటించేలా అప్రమత్తం చేయవచ్చని ఈ బృందం చెబుతోం ది. దీనికోసం సీసీ కెమెరాలకు అనుసంధానమై ఉండే కం ప్యూటర్‌లో ఈ ‘సూపర్ వ్యూ’ సోషల్ డిస్టెన్స్ మానిటర్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. సీసీ కెమెరా ఏర్పాటు చేసిన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫొటోలు, వీడి యోలను ఈ సాఫ్ట్‌వేర్ క్యాప్చర్ చేస్తూ ఏ ఇద్దరు మీటరు కంటే తక్కువ దూరంలో ఉన్నా స్పీకర్ ద్వారా అప్రమత్తం చేస్తుంది.ఫోన్‌లో సూపర్ వ్యూ సోషల్ డిస్టెన్సింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రంట్/బ్యాక్ కెమెరాను సెలక్ట్ చేసి స్టార్ట్ బటన్ నొక్కితే వీడియోను క్యాప్చర్ చేసి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంది. ఈ స్టార్టప్ కంపెనీకి బాబు మునగాల చైర్మ న్ కాగా, సీఈవోగా రాజా కొణతాల, వైస్ ప్రెసిడెంట్‌గా తేజ కొణతాల, ఆపరేషన్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా కె.వెంకట్ ఉన్నారు. ఈ టెక్నాలజీని కూర్మన్నపాలెంలోని శివాజీనగర్‌లో గల గేటెడ్ కమ్యూనిటీలో ప్రయోగాత్మకంగా అమలు చేసి విజయవంతమయ్యారు. ఈ టెక్నాలజీ కావాలనుకున్నవారు 7799945666 నంబర్‌కుగానీ, teja@supervue.ai మెయిల్‌లో గానీ సంప్రదించవచ్చని వారు తెలిపారు.