యూపీ : యూపీలోని గౌతమ్ బుద్ధ్ నగర్ లో కరోనా హాట్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ఇంటి వద్దకే నగదు పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ ఓ ప్రకటనలో తెలిపారు. బ్యాంక్ మిత్రల సాయంతో ఆధార్ అనుసంధానంతో జిల్లాలోని బ్యాంకులు నగదు పంపిణీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.మొత్తం 19 లొకేషన్ల లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో ఉచితంగా ఈ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.