మహబూబాబాద్ , (ఆరోగ్యజ్యోతి):మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలం ఎల్లంపేట శివాజీ యూత్ అసోసియేషన్ అద్వర్యంలో బుధవారం నాడు 25 క్వింటాలు బియ్యం ములుగు ఎమ్మెల్యే సీతక్క అద్వర్యంలో నిరుపేదలకు అందించడం జరిగింది.ఈ సందర్బంగా సీతక్క గారు మాట్లాడుతూ పేద ప్రజల ఆకలి తీర్చడానికి నేను ఇచ్చిన పిలుపు కై మంచి మనస్సు తో ముందుకు వస్తున్న దాతలకు ములుగు ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమములో ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషాయూత్ నాయకులూ దండే భద్రయ్య మానేపల్లి ఉమేష్ ,అలువాల రమేష్ ఊరుగొండ మహేష్ ,సాయిబాబు బుచ్చిరాములు ,నాగరాజు ,అశోక్ రాజు ,సాయిబాబు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బానోత్ రవిచందర్,ఎంపీటీసీ మావురపు తిరుపతి రెడ్డి,ఆకుతోట చంద్రమౌళి,చక్రపు రాజు,ఎండీ అజ్జు ,మేడం రమణాకర్,తదితరులు పాల్గొన్నారు.