కరోనా ఇన్ఫెక్షన్‌తో శ్వాస తీసుకోలేక నరకయాతన అనుభవిస్తున్న రోగుల పాలిట ‘ఈసీఎంఓ’లు ఆశాదీపంలా కనిపిస్తున్నాయి. ఈసీఎంఓ అంటే ‘ఎక్స్‌ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్’. పేరుకు తగ్గట్టుగానే ఈ పరికరం ఎన్నో ఎక్స్‌ట్రా పనులు చేస్తుంది. ఊపిరితిత్తుల పనితీరు పూర్తిగా మందగించిన రోగుల శరీరంలో జీవక్రియలు గాడి తప్పకుండా ఉండేందుకు మూడో ఊపిరితిత్తిలా ఈసీఎంఓలు ఊతమిస్తాయి. రోగి శరీరం నుంచి రక్తాన్ని సేకరించి తనలోని కృత్రిమ ఊపిరితిత్తి(ఆక్సిజనేటర్)లోకి పంపించి, ఆ రక్తంలోకి ఆక్సిజన్‌ను చేర్చి, కార్బన్ డయాక్సైడ్‌ను తొలగిస్తుంది. శ్వాసకోశ వ్యవస్థ విఫలమై కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న 32 మంది కరోనా రోగులకు అమెరికాలోని వెస్ట్ వర్జీనియా వర్సిటీ శాస్త్రవేత్తలు ఈసీఎంఓలతో చికిత్స అందించగా ఆశాజనక ఫలితాలు వచ్చాయి