సత్యమార్గం అద్వర్యంలో అన్నదానం

ఖమ్మం, (ఆరోగ్యజ్యోతి): ఎదులాపురం గ్రామo, వెంపటి నగర్  నందు ఇతర రాష్ట్రాల నుండి వలస వొచ్చి, రవాణా సదుపాయం లేక సొంత రాష్ట్రాల కు వెళ్లలేక ఇబ్బంది పడుతున్న వారికీ ప్రతి రోజు  అన్న వితరణ నిర్వహిస్తున్న సంగతి విధితం,  అందులో భాగంగా ఈ రోజు 100మంది కూలీలకు  వెజిటేబుల్ బిర్యానీ, రహిత(పెరుగు చట్నీ )  వితరణ ఇవ్వడం జరిగింది.గత కొన్ని రోజులుగా సత్యమార్గం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేద ప్రజలకు సహాయం చేస్తున్నామని ఇందులో భాగంగా వలస కార్మికులకు ఈరోజు వెజిటేబుల్ బిర్యాని చేయడం జరిగిందన్నారు. సామాజిక దూరాన్ని పాటించడం వల్ల వ్యాధి ప్రజల వద్దకు రాలేదని తెలిపారు ఈ కార్యక్రమం లో సత్య మార్గం  సంస్థ సభ్యులు నరేష్ కుమార్, వెంకటేష్ స్థానిక యువజన సంగం ప్రతినిధి సురేష్ మరియు వారి మిత్ర బృందం పాలుగోన్నారు.