టి పి హెచ్ డి ఎ ఆధ్వర్యంలో డి ఎం హెచ్ ఓ కు వినతి పత్రం
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్య అధికారులకు వాహన అలవెన్సులు ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చందు కు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తన చాంబర్లో వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీధర్ మిట్ పెల్లి వార్ మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల జిల్లావ్యాప్తంగా వైద్యులు అందరూ తమ విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారని ప్రతిరోజు విధుల నిర్వహణ కొరకు వాహనాలు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రతిరోజు అన్ని గ్రామాల్లో పర్యటించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్యులందరూ అన్ని గ్రామాలు పర్యటిస్తున్నారని వారు పేర్కొన్నారు.కొన్ని జిల్లాల్లో వైద్య అధికారులకు వాహన అలవెన్సులు ఇస్తున్నారని అదే తరుణంలో ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్న వైద్యాధికారులు అందరికీ వాహన అలవెన్సులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ వాహనాలు లేకపోవడంవల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉన్న పరిస్థితి ఏర్పడుతుందని తక్షణమే అలవెన్సులు చెల్లించాలని కోరారు.ఈ కార్యక్రమంలో , జనరల్ సెక్రెటరీ డాక్టర్ ఎం క్రాంతి కుమార్, ట్రెజరర్ డాక్టర్ పవన్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాహుల్, డాక్టర్ శ్రీకాంత్ మిట్ పెల్లి వార్, డాక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.