హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): ఆయుష్మాన్ భారత్ దివస్ సందర్భంగా తెలంగాణతోపాటు దేశ ప్రజలకు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నివర్గాలకు వైద్యాన్ని అందించడానికి 2018లో ఏప్రిల్ 29వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించారని, పేద, అణగారిన వర్గాలకు చెందిన కుటుంబాలకు చవకైన, నాణ్యమైన వైద్యం అందించడం దీని లక్ష్యమని తెలిపారు.దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేయాలని సూచించారు. 50 కోట్లకు పైగా లబ్ధిదారులతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఇదని గుర్తు చేశారు. ఈ క్రమంలో కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతిజ్ఙ చేశారు.