ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం కొత్తగా 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,332కు చేరింది. డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేషీలో పనిచేసే అటెండర్‌కు కూడా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో మంత్రి నాని, ఆయన భద్రతా సిబ్బంది, పేషీలోని మిగతా ఉద్యోగులు మొత్తం 12 మందికి పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది.