హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలో బుధవారం కొత్తగా 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 35 మంది డిశ్చార్జి అయ్యారు. తెలంగాణలో కేసుల సంఖ్య 1,016కు చేరుకోగా, వీరిలో 25 మంది మృత్యువాతపడ్డారు. 409 మంది కోలుకొని ఇంటికి వెళ్లారు. మిగిలిన 582 మంది గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు