రష్యాలో రికార్డు స్థాయిలో6,411 కరోనా కేసులు

మాస్కో: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రష్యాపై పంజా విసురుతోంది. ఇక్కడ కరోనా కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. మంగళవారం ఒక్క రోజే 6,411 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఇక్కడి కరోనా వైరస్ క్రైసిస్ రెస్పాన్స్ కేంద్రాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదేనని సదరు కేంద్రాలు తెలిపాయి. దీంతో రష్యాలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 93,558కి చేరింది. అదే సమయంలో ఇక్కడ 24 గంటల్లో 72 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో రష్యాలో కరోనా మరణాల సంఖ్య 867కు చేరింది.