మహారాష్ట్రలో మరింత విజృంభించిన కరోనా.. బుధవారం ఒక్కరోజే 597 కరోనా పాజిటివ్ కేసులు

ముంబై,(ఆరోగ్యజ్యోతి): మహారాష్ట్ర అనికరోన  మహమ్మారి గజగజ లదిస్తుంది . కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 32 మంది కరోనా బారిన పడి మరణించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కొత్తగా బుధవారం ఒక్కరోజే 597 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో.. మహారాష్ట్రలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,915కి చేరింది.బుధవారం కరోనా నుంచి కోలుకున్న 205 మందిని డిశ్చార్జ్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకూ మహారాష్ట్రలో 1593 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. మహారాష్ట్రలో ఇప్పటివరకూ 432 మంది కరోనా బారిన పడి మరణించారు.