ధారావి: ముంబైలోని అతిపెద్ద మురికివాడ ధారావిలో కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విరుచుకుపడుతోంది. ధారావిలో కొత్తగా మంగళవారం ఒక్కరోజే 42 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. మంగళవారం నాడు ధారావిలో నాలుగు కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో.. ఒక్క ధారావిలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 330కి చేరిందిఇప్పటికే ఈ ప్రాంతంలో కొత్తగా చనిపోయిన వారితో కలిపి 18 మంది కరోనా బారిన పడి మరణించారు. ధారావిలోని మహిమ్ ప్రాంతంలో శనివారం నుంచి మూడు రోజుల పాటు అసలు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అలాంటిది మంగళవారం ఒక్కరోజే ఈ ప్రాంతంలో ఐదు కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం.