ముంబై, (ఆరోగ్యజ్యోతి): దేశంలోనే కరోనా బాధిత రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్రలో కోవిడ్-19 మృతుల సంఖ్య 400కు చేరింది. పుణెలో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. గత 12 గంటల్లో కొత్తగా 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాలో కోవిడ్ పాటివ్ కేసుల సంఖ్య 1.722కు చేరినట్టు జిల్లా ఆరోగ్య శాఖ అధికారి భగవాన్ పవార్ గురువారం తెలిపారు. మరోవైపు, మహారాష్ట్రలో కోవిడ్-19 కేసులు 10,000కు చేరుగా, మృతులు 400 పైమాటేనని అధికారులు వెల్లడించారు.కరోనా మృతుల పరంగా గుజరాత్ 181 మందితో రెండో స్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్‌లో మృతుల సంఖ్య 119గా ఉంది. ఢిల్లీలో 54, రాజస్థాన్‌లో 51, ఉత్తరప్రదేశ్‌లో 36, తమిళనాడులో 25, పశ్చిమబెంగాల్‌లో 22, ఆంధ్రప్రదేశ్‌లో 31, తెలంగాణలో 25 మంది మృతి చెందారు.