నిత్యావసర సరుకుల పంపిణి

రాజన్న సిరిసిల్ల,(ఆరోగ్యజ్యోతి) :   వంతడుపుల, కిష్టారావుపల్లె, రంగంపేట మరియు జంగాంరెడ్డి పల్లె గ్రామలలో ఈ రోజు 31 కుటుంబాలకు  15 కిలోల బియ్యం మరియు 12రకాల నిత్యావసర సరకులను...బెంద్రం తిరుపతి రెడ్డి వితరణ చేశారు. ఈ సందర్భంగా బెంద్రం తిరుపతి రెడ్డి గారు మాట్లాడుతూ  ఇల్లంతకుంట మండలంలో  ఉపాధికి వెళ్లక లాక్ డౌన్ సమయంలో ఇబ్బంది పడుతున్న భవన కార్మికులు,కడు నిరుపేదలకు, వయస్సు మళ్ళిన నిస్సహాయ స్థితిలో ఆకలితో బాధపడుతున్న వారికి నేటికీ 306  కుటుంబలకు నిత్యావసర సరుకులు ఉచితంగా అందించి  వాళ్లకు  చేయూతను నిచ్చారు  అదేవిధంగా  ప్రతి ఒక్కరు తమతమ చుట్టుపక్కల ఉన్న నిస్సహాయకులకు సహాయం చేసి మానవత దృక్పద్దం చాటుకోవలని కోరారు .ప్రపంచం అంతయు కరోనా మహమ్మరితో అతలాకుతలం అవుతున్న సందర్భంలో భారత దేశం మన  ప్రధానమంత్రి ప్రియతమ నరేంద్రమోడీ గారు ఎంతో కృషి చేస్తున్నారని. మందులేని కరోనా నుండి రక్షించుకొనుటకు స్వీయ  నియంత్రణలో ఉండాలని కోరారు . ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల.సంతోష్ ,బీజేవై ఎం నాయకులు బోల్లారం ప్రసన్న,కాసం శివ రెడ్డి, టి శ్రవణ్,   సి ఎహ్  భాను, శ్రవణ్ రెడ్డి, చిమ్మన గొట్టు శ్రీనివాస్,చింతలపెల్లి రాజిరెడ్డి,యామఆంజనేయులు, కనకయ్య, కె. ఆంజనేయులు,  చందు,  బాలాజీ,అనిల్   తదితరులు పాల్గొన్నారు.