అహ్మాదాబాద్ : గుజరాత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. గత 24 గంటల్లో గుజరాత్ లో 313 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసులు 4395 చేరుకున్నాయి. ఈ కేసుల్లో 613 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు.రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 214 మంది మృతి చెందినట్లు గుజరాత్ వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. నిన్న ఒక్క రోజే గుజరాత్ లో 308 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.