భారత్‌లో పెరుగుతున్న కరోనా మరణాలు.. గత 24 గంటల్లో..

 


న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ తన ప్రభావాన్ని చూపుతోంది. భారత్‌లో బుధవారం కొత్తగా 1813 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో 71 మంది కరోనా బారిన పడి మరణించినట్లు వెల్లడించింది. తాజా పాజిటివ్ కేసులతో కలిపి భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31,787కు చేరింది. ఇప్పటివరకూ 1008 కరోనా మరణాలు నమోదయ్యాయి. 7797 మంది కరోనా నుంచి కోలుకున్నారు. భారత్‌లో ప్రస్తుతం ఉన్న కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 22,982గా కేంద్రం ప్రకటించింది.