భూపాలపల్లి ,(ఆరోగ్యజ్యోతి): అమృతవర్షిణి అక్షర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక భూపాలపల్లి మున్సిపాలిటి పరిధిలో ఉన్నటువంటి నిరాశ్రయులకు వృద్ధులకు 50 మందికి 22 వ రోజు అన్నదానం చేయడం జరిగింది . ఈ అన్నదానానికి దాత ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ నెట్ల పల్లువన్ రాజు మా సంస్థ ద్వారా చేస్తున్నా నిత్యా అన్న దానం గురించి తెలుసుకొని తన వంతు రెండు రోజులు కు సరి పడు ఆర్థిక సహాయం చేయడం జరిగిన వారి సూచన మేరకు చిన్న పిల్లలు చేతుల మీదుగా బోజనాలను పంపిణీ చేయడం జరిగినది.కరోన వైరస్ వ్యాధి వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సోకిన ఈ వ్యాధి వల్ల పేదలు కూలి దొరకక నా నా అవస్థలు పడక తప్పడం లేదన్నారు. సామాజిక దూరం ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవ డం వల్ల ఈ వ్యాధి దరిచేరదు . కార్యక్రమంలో అమృతవర్షిణి అక్షర స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలి శైలజ శ్యామ్ ప్రసాద్ ప్రతినిధి ఉప్పు నీటి శ్రీనివాస్ పంతగానిరాజేందర్ పాల్గొన్నారు.