గుండి గ్రామస్తులకు 20 క్వింటాళ్ళ కూరగాయలు పంపిణీ 

 


కుంరంభీం , (ఆరోగ్యజ్యోతి): కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుండి గ్రామ పంచాయతీ పరిధిలో  ఈరోజు గ్రామంలోని 500ల కుటుంబాలకు ఎనిమిది రకాల కూరగాయలను  గుండి సర్పంచ్.జాబరి.అరుణ-రవీందర్,తెరాస మండల అధ్యక్షులు, గుండి ఎంపీటీసీ సభ్యులు గాదవేణి.మల్లేష్ యాదవ్, ఉప సర్పంచ్ బట్టుపెల్లి. శేషాద్రి,తెరాస గ్రామ అధ్యక్షులు దాంపెళ్లి.శ్యామ్ రావ్  అద్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కుంరంభీం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి.కోవ.లక్ష్మీ గారు, విశిష్ట అతిథిగా ఆసిఫాబాద్ శాసనసభ్యులు .ఆత్రం.సక్కు పాల్గొని ప్రజలకు కరోనా వ్యాధిని ఎలా నివారించాలో, ఎలా రక్షణ పొందాలో తగు సూచనలు చేశారు.  సామాజిక దూరం పాటించడం వలన కరుణ వ్యాధి దరిచేరని ఈ సందర్భంగా వారు సూచించారు.ఒకటి సామాజిక దూరం మరొకటి ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండటమే ఉత్తమమని వారు పేర్కొన్నారు.మాజీ మార్కెట్ చైర్మన్ చిలువేరు.వెంకన్న,నాయకులు శైలేందర్,వార్డ్ సభ్యులు, తెరాస కార్యకర్తలు ఉన్నారు.