భగీరథుని కృషితోనే మానవాళికి నీరు.


ఎమ్మెల్యే జోగు రామన్నా
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి) : పండేందుకు నీరు అవసరమని భావించి ఆనాడు ఆయాన తప్పస్సు చేసి దివి పైకి గంగను తీసుకొచ్చిన ముని భగీరథుని కృషి మారువలేనిదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నా అన్నారు.గురువారం భవిరథుడి
 జయంతి సందర్బంగా ఎం.ఎల్.ఏ  జోగు రామన్న  తన నివాసంలో జయంతి వేడుకలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో  కొనసాగుతున్న లాక్ డౌన్ సందర్భంగా సామాజిక దూరం పాటిస్తూ భగీరతుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం జోగు రామన్నా  మాట్లాడుతూ ఆనాడు ఆ భగీరథుడు గంగను  దివిపైకి రప్పించి ప్రజలకు నీటి కష్టాలు దూరం చేయడంతో పాటు పంటలు పండించుకునేందుకు ఎంతో మేలు చేసాదన్నారు.నాటి నుంచి ఆ భగీరథుని కృపతో గంగ లోకానికి నీటిని అందించిందని తెలిపారు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ ప్రజలకు నీటి ఇబ్బందులు దూరంచేసేందుకు పరిశుద్ధ్య జలాన్ని అందించడంతో పాటురాష్ట్రంలో ఎకరాలను సస్యశామలం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును మరియు ఎన్నో ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. రాబోవు రోజుల్లో రాష్ట్రంలో ప్రజలకు తాగునీరు,అన్నదాతలకు సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.ఇందులో బింపూర్ pacs చైర్మన్ అడ్డి బోజారెడ్డి, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ప్రహ్లాద్ తదితరులు ఉన్నారు.