చైనా వల్ల నరకంలో 184 దేశాలు

 


వాషింగ్టన్‌: కరోనా గురించి సరైన సమాచారం ఇవ్వని చైనా వల్ల 184 దేశాలు నరకంలో ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ధ్వజమెత్తారు. జర్మనీ డిమాండ్‌ చేస్తున్న 140 బిలియన్‌ డాలర్ల పరిహారం కన్నా తాము ఎక్కువే కోరుతామన్నారు. ఇలాంటిది ఎప్పుడూ జరుగలేదన్న ట్రంప్‌, ఈ సంక్షోభం నుంచి కోలుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.  మరోవైపు అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ట్రంప్‌ తెలిపారు. కాగా, అమెరికాలో కరోనా మృతుల సంఖ్య వియత్నాం యుద్ధంలో చనిపోయిన సైనికులకన్నా అధికంగా 60,495కి చేరింది. కేసులు సంఖ్య పదిలక్షల మార్కును దాటి 10,48,834కి పెరిగింది.కరోనాకు సంబంధించి ట్రంప్‌ చేస్తున్న వ్యాఖ్యలను ఆ దేశ ప్రజలు విశ్వసించడం లేదని రాయిటర్స్‌ నిర్వహించిన సర్వేలో తేలింది. క్రిమిసంహార రసాయనాలను శరీరంలోకి ఇంజెక్ట్‌ చేయడం ద్వారా వైరస్‌ను నిర్మూలించవచ్చన్న ఆయన వ్యాఖ్యలను 98 శాతం మంది వ్యతిరేకించారు. అయితే మొత్తంమీద ట్రంప్‌కు ఉన్న ప్రజాదరణలో పెద్దగా మార్పులేదని తెలుస్తున్నది.