మే 17 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు: పంజాబ్ సీఎం కీలక నిర్ణయం

అమృత్‌సర్,(ఆరోగ్యజ్యోతి): పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మే 17 వరకూ లాక్‌డౌన్ పొడిగించారు. వాస్తవానికి మే 3తో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ రెండో దశ ముగుస్తుంది. తొలిదశ మార్చి 24 నుంచి ఏప్రిల్ 14దాకా సాగింది.ఇప్పటికే రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రధాని లాక్‌డౌన్ కొనసాగించాలా వద్దా అనే అంశంపై నిపుణుల సలహా తీసుకుంటున్నారు. ఈ వారాంతంలో మరోసారి జాతినుద్దేశించి చేసే ప్రసంగంలో లాక్‌డాన్ కొనసాగింపుపై కీలక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. ఈ తరుణంలో అనేక రాష్ట్రాల సీఎంలు లాక్‌డౌన్ పొడిగించాలని కోరుతున్నారు. ఈ తరుణంలో పంజాబ్ సీఎం ఏకంగా రెండువారాలు పొడిగించారు. మిగతా సీఎంలూ అమరీందర్‌ను అనుసరించే అవకాశం ఉంది.