120 కుటుంబాలకు బియ్యం, కూరగాయలు పంపిణీ :

బద్వేలు,(ఆరోగ్యజ్యోతి) :కరోనా వైరస్ కారణంగా  లాక్ డౌన్ సమయంలో దినసరి& వలస కూలీల కు పనులు లేక ఇంటికే పరిమితమై తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలు కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం  కలసపాడు   పట్టణం లో ఎరుకల కాలనీ , టైలర్స్ కాలనీ,తొట్టి వీధి, బలిజ వీధి   లో ఉన్న పేదలను గుర్తించి 120  కుటుంబాలకు కూరగాయలు  అందజేశారు.    శ్రీ జ్ఞాన సరస్వతిదేవి చారిటబుల్ ట్రస్ట్  ఆధ్వర్యంలో  ట్రస్ట్ కలసపాడు టీం సహకారంతో   కలసపాడు మండల కార్యదర్శి చరణ్  చేతుల మీదుగా పంపిణీ చేశారు.    ఈ కార్యక్రమంలో ఆ ట్రస్ట్   ప్రతినిధులు నవీన్, సిద్దయ్య, ప్రభు, ఖదీర్, ఫయాజ్, రసూల్,     పాల్గొన్నారు.