ముంబై: మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. ఇప్పటికే ఆక్కడ నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేలకు చేరువయ్యింది. దేశవ్యాప్తంగా చూసినప్పుడు మహారాష్ట్రలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటే.. మహారాష్ట్రలో జిల్లాల వారీగా చూసినప్పుడు మాత్రం పుణేలో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ బుధవారం సాయంత్రానికే కేసుల సంఖ్య 1,595కు చేరగా.. గత 12 గంటల్లో మరో 127 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో పుణే జిల్లాలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1722కు చేరింది. కాగా, జిల్లాలో ఒక్కరాత్రిలోనే 100కు పైగా కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోందని పుణే జిల్లా ఆరోగ్య అధికారి భగవాన్ పవార్ పేర్కొన్నారు.