‘విద్యుత్‌' విరాళం 11.40 కోట్లు

హైదరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి): కొవిడ్‌-19 నివారణలో తమవంతుసాయంగా విద్యుత్‌ ఉద్యోగులు, పింఛన్‌దారులు భారీ విరాళాన్ని ప్రకటించారు. తమ ఒకరోజు వేతనం రూ.11.40 కోట్లను సీఎం సహాయ నిధికి అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును బుధవారం ప్రగతిభవన్‌లో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు సీఎం కేసీఆర్‌కు అందజేశారు. కరోనా కష్టకాలంలో ఉద్యోగులంతా రేయింబవళ్లు కష్టపడి 24 గంటలపాటు విద్యుత్‌నందిస్తున్నారని కేసీఆర్‌ కొనియాడారు. కార్యక్రమంలో ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాలరావు, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, డైరెక్టర్‌ సూర్యప్రకాశ్‌, ఉద్యోగ సంఘాల నేతలు శివాజీ, రత్నాకర్‌రావు, అంజయ్య, బీసీరెడ్డి, సాయిబాబా, ప్రకాశ్‌, జాన్సన్‌, రమేశ్‌, వజీర్‌, కుమారస్వామి, సాయిలు, గణేశ్‌, సత్యనారాయణ, షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.