ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ ఖిల్లా ఏరియాల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 104 ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ కృష్ణవేణి, డాక్టర్ సుజాత రోగులను పరీక్షించి వైద్య సేవలందించారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ అశోక్ రెడ్డి ,ఎగ్ బాల్,ల్యాబ్ టెక్నీషియన్ నవీన్ కుమార్ ,సురేందర్ డ్రైవర్లు ఇబ్రహీం, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.