నిమ్స్‌లో 1 నుంచి ఉచిత టెలీ కన్సల్టేషన్

హైదరాబాద్‌,(ఆరోగ్యజ్యోతి):కరోనా వ్యాధి విస్తరిస్తున్న తరుణంలో రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అత్యవసరం కాని చికిత్సల కోసం నిమ్స్‌ యాజమాన్యం ఉచిత టెలీ-కన్సల్టేషన్‌ సేవలకు శ్రీకారం చుట్టింది. ఏడు రకాల విభాగాల వైద్య నిపుణులను అందుబాటులో ఉంచి రోగులకు సౌకర్యవంతంగా సేవలందించేలా ఈ సేవలను మే 1 నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు నిమ్స్‌ మెడికల్‌ సూపరింటిండెంట్‌ డాక్టర్‌ నిమ్మ సత్యనారాయణ తెలిపారు. నిమ్స్‌ మొబైల్‌ యాప్‌తో పాటు 040-2348 9244 నంబరును అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ సేవలకు రోజూ ఉదయం 9.30 నుంచి 12.30 వరకు స్లాట్‌ బుక్‌ చేసుకున్న రోగులకు వైద్యులే ఫోన్‌లో సమాధానాలిస్తారన్నారు