అవును అది సరైన మందే!

క్లోరోక్విన్‌తో కరోనాకు అడ్డుకట్ట!


ఇప్పటికే పలు పరిశోధనల్లో వెల్లడైంది





శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి





హెల్త్‌ వర్కర్లకు కూడా ఐసీఎంఆర్‌ 


ఈ మాత్రలనే సిఫారసు చేసింది


ప్రముఖ వైద్యుడు రవిచంద్ర బీరం



హైదరాబాద్‌ (ఆరోగ్యజ్యోతి) : మలేరియా నివారణకు ఉపయోగించే క్లోరోక్విన్‌ కరోనా వైరస్‌ నియంత్రణకు కూడా ఉపయోగపడుతుందని ప్రముఖ వైద్యుడు రవిచంద్ర బీరం చెప్పారు. ఈ విషయం ఇప్పటికే పలు పరిశోధనల్లో వెల్లడైందని, ఇందుకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు. ముందు జాగ్రత్తగా ఈ మాత్రలను వేసుకోవడం వల్ల  సత్ఫలితాలు వస్తున్నాయని  తెలిపారు. ‘‘కరోనా అనుమానిత, పాజిటివ్‌ కేసులతో సన్నిహితంగా ఉండే వైద్య సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా క్లోరోక్విన్‌ను వాడాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి (ఐసీఎంఆర్‌) సిఫారసు చేసింది. అయితే, కరోనా పేషెంట్లకు కూడా సిఫారసు అంశంపై ఐసీఎంఆర్‌ పరిశీలన చేయాల్సిన అవసరముంది’’ అని ఆయన అన్నారు.క్లోరోక్విన్‌ లేదా హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పాటు అజిత్రోమైసిన్‌ తీసుకోవడం ద్వారా కరోనాను నాలుగైదు రోజుల్లో నియంత్రించవచ్చన్నారు. వైరస్‌ శరీరంలోకి ప్రవేశించకుండా ఈ మందులు అడ్డుకుంటాయన్నారు. గర్భిణులు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను వాడాలన్నారు. ‘‘చైనాలో ఈ మందు వాడినందు వల్లే అక్కడ కరోనా నియంత్రణలోకి వచ్చిందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. క్లోరోక్విన్‌తో కరోనా నియంతి రంచవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా ప్రకటించారు. కానీ, శాస్త్రీయ ఆధారాలు లేవంటూ దీనికి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆధారాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి’’అని ఆయన చెప్పారు. వీటి వినియోగంపై  కేంద్రం తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.