వైటిసి కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

 


జిల్లా కేంద్రంలో 500 బెడ్ లకు  ప్రణాళిక


ఐదు భవనాలలు ఎంపిక


100 బెల్టు సిద్ధమైన వైటిసి సెంటర్


ఆదిలాబాద్ (ఆరోగ్య జ్యోతి): రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ రిమ్స్ లో కరోనా వైరస్ రోగులకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు.రోగుల తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలో భాగంగా జిల్లా కేంద్రంలోని వైటిసి సెంటర్ లో వంద పడకల తో ప్రత్యేక వార్డు సిద్ధం చేశారు. కరోన వైరస్ లక్షణాలు, అనుమానిత కేసులు, కరోన పాసిటివ్ వచ్చిన కేస్ కు చుట్టుపక్కల నివాసమున్న వారికి ప్రతేకంగా ఈ వార్డుల్లో14 రోజులపాటు ప్రతేక చికిత్స లు అందిస్తారు. శనివారం నాడు జిల్లా కలెక్టర్ దేవసేన వైటిసి సెంటర్ ను పరిశిలించారు.



అన్నిరకాల సౌకర్యాలు  అందుబాటులో ఉన్నాయ అని వైటిసి కేంద్రం ఇంచార్జ్ , జిల్లా ఇమ్మునైజెసన్ అధికారి డాక్టర్ శ్రీకాంత్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మరో నాలుగు వందల బెడ్ లను ముందు జాగ్రత గా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ట్రైబల్ వేల్పార్ డిగ్రీ కళాశాల, మైనారిటీ బాలుర  పాటశాలతో  పాటు చందా లోని మైనారిటీ స్కూల్ లని కలెక్టర్ పరిసిలించారు. ఒక్కొక్క భవనంలో 100 బెడ్ లను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపినారు.మొత్తం  రిమ్స్ ప్రతేక వార్డ్ తూ పాటు, మరో ఇదు ప్రత్యేక వార్డులలో 500 బెడ్ లను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపినారు. ఈ కార్యక్రమంలో డా.వై.సి.శ్రీనివాస్. డా సోహెల్. హెల్త్ సూపర్ వైజర్స్ బి.సుభాష్.ఏ.సురేష్.జె.సంతోష్. ప్రేమసింగ్ HA. ఫార్మసీస్ట్ ఎం.శ్రీకాంత్.పోలీసు  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.