ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ వ్యాఖ్యలు
జెనీవా (స్విట్జర్లాండ్): భారతదేశంలో కరోనా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు మైఖేల్ జే ర్యాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే అద్భుత సామర్ధ్యం భారతదేశానికి ఉందని డబ్ల్యూహెచ్‌ఓ కార్యనిర్వాహక సంచాలకులు మైఖేల్ జే ర్యాస్ వ్యాఖ్యానించారు. భారతదేశానికి గతంలో ప్రబలిన స్మాల్ పాక్స్, పోలియో అంటువ్యాధులను సమర్ధంగా నిర్మూలించిన అనుభవం ఉందని మైఖేల్ పేర్కొన్నారు.అత్యధిక జన సమ్మర్థం ఉన్న భారతదేశంలో కరోనా వైరస్ ప్రబలకుండా పెద్దసంఖ్యలో ల్యాబ్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మైఖేల్ సూచించారు. భారత్ లాంటి దేశంలో గత అనుభవాలతో కరోనా వైరస్ వ్యాపించకుండా గట్టి చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ ఈడీ మైఖేల్ కోరారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోగుల సంఖ్యతోపాటు మృతుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.