మూడేళ్ల చిన్నారికి కరోనా

18 నెలల శిశువుకు వైరస్‌ లక్షణాలు


హైదరాబాద్‌ (ఆరోగ్యజ్యోతి): హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మూడేళ్ల చిన్నారికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో పాపను గాంధీ ఆస్పత్రికి పంపించారు. ఐదు రోజుల క్రితం చిన్నారిని నిలోఫర్‌కు తీసుకొచ్చారు. ఆదివారం వచ్చిన రిపోర్టులో ఆమెకు కరోనా ఉన్నట్లు తేలిందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌  మురళీకృష్ణ తెలిపారు. పాపకు చికిత్స అందించిన వైద్యులు, సిబ్బంది నమూనాలను పరీక్షకు పంపారు. ఫలితం వచ్చే వరకు హోం క్వారంటైన్‌లో లేదా ఆసుపత్రి ఐసోలేషన్‌లో ఉండాలని సూచించినట్లు సమాచారం. నిలోఫర్‌లో చికిత్స పొందుతున్న 18 నెలల శిశువుకు కరోనా లక్షణాలు ఉండడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.