మరణమా నన్నెందుకు
వెంటాడుతున్నావు..?
మరణమా నన్నెందుకు
వేటాడుతున్నావు..?
నాలుగు పదులు నిండని నాకు నూరేళ్లు
దాపురించినట్లు
నన్నెందుకు తరుముతున్నావు
"మరణమా"
భార్య భర్తల అనుబంధం
సుగంధ పరిమళాలు
వెదజల్లే సమయాన
నిర్జీవంగా నన్ను చేస్తూ
దేహం నుంచి ఉబికి
వస్తున్న రుద్రం తో
తడిసి ముద్డుతున్నా
" మరణమా"
ముద్ద బంతి లాంటి
బిడ్డ ముసిముసి
నవ్వులతో ముద్దులొలికిస్తే..
బాసటగా ఉంటానని
భరోసా ఇవ్వని
దీన స్థితితో
కోస మెరుపు కోసం
జీవిస్తున్నా.. "మరణమా"
కష్టాల కడలిని జీవతమంత ఈదుతూ
అరవై ఏళ్ల అమ్మ !
జీవచ్చవంలా
పడిఉన్న నన్ను చూస్తూ
విషాద సాగరమై..
కళ్ళ నుంచి రాలుతున్న
కన్నీటిని చీరకొంగుతో
ఒత్తుకుంటూ..
సకలసేవాలు చేస్తున్న
అమ్మ రుణం ఎలాతీర్చుకునేది..?
ఇది విధి విచిత్రమో..!
విలాపమో..?
భవిష్య ! సగటు మనిషి
బతుకు చిత్రంమో..?
మరణశాసనమో..?
ఇంకేమీ చేయాలి...
-----సుభాషిణి