ప్రపంచ దేశాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ యుకే ప్రధాని బోరిస్ జాన్సన్ కు సోకింది. కరోనా వైరస్ తో యుకే లో 11,658 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 578 మంది చనిపోయారు. వీరిలో 135 మంది ఇప్పటికే కోలుకున్నారు. తాజాగా 4,665 మందికి కరోనా లక్షణాలు ఉండగా..అందులో 163 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉందని యుకే వైద్యాధికారులు తెలిపారు.ఈ నేపథ్యం లో యుకే ప్రజల్ని కలవరానికి గురిచేస్తే ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు బాంబు పేల్చారు. కొన్ని రోజులుగా జాన్సన్ కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్ లో ఉన్నారని.. ఐతే పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టీ ఓ ప్రకటించారు.ఇక తనకు కరోనా సోకిందన్న విషయాన్ని స్వయంగా బోరిస్ జాన్సన్ కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ఇప్పుడు ఏకంగా బ్రిటన్ ప్రధాన బోరిస్ జాన్సన్ కు కరోనా సోకడంతో తమ పరిస్థితి ఎలా అంటూ అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.