నిజామాబాద్: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున కరోనా అనుమానితుడు గుండెపోటుతో మృతిచెందాడు. రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన అతన్ని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. అతనికి గుండెపోటు వచ్చిన విషయాన్ని గమనించిన వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తుండగానే మృతి చెందాడు. అతనికి కరోనా ఉందో లేదో పరీక్షల రిపోర్టు వస్తేగాని తెలియదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వర్‌రావు తెలిపారు.