కరోనా ఔషధ రేసులో ఐఐటీ గువాహటి

గువాహతి: కరోనాకు ఔషధాన్ని కనుగొనే రేసులో ఐఐటీ గువాహటి కూడా నిమగ్నమైంది. వైర్‌స కట్టడికి చిన్నపాటి మాలిక్యూల్స్‌ ఇన్‌హైబిటర్స్‌ను రూపొందించడంపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. కొవిడ్‌-19పై ప్రయోగాలకు ప్రత్యేక రిసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఐఐటీ ప్రకటించింది. ఇప్పటికే పాలిమరైజ్‌ చైన్‌ రియాక్షన్‌(పిసిఆర్‌) మెషీన్‌ను రూపొందించినట్లు తెలిపింది. తాము అభివృద్ధిచేసిన రెండు పీసీఆర్‌లను ఇప్పటికే గువాహతి మెడికల్‌ కాలేజీ అండ్‌ హాస్పిటల్‌కు అందజేసినట్లు వెల్లడించింది.