గర్భిణికి పరీక్షలు నిర్వహించిన ఎమ్మెల్యే ఆనంద్‌

మోమిన్‌పేట, (ఆరోగ్యజ్యోతి) : వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం టేకులపల్లికి చెందిన బచ్చంగారి సుధారాణి 9 నెలల గర్భవతి. సోమవారం ఆమెకు అస్వస్థతగా ఉండడంతో ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ కు ఫోన్‌ చేశారు. అదే సమయంలో గ్రామంలోనే ఉన్న స్వయానా వైద్యుడైన వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌.. విషయం తెలిసి బాధితురాలి ఇంటికెళ్లి ఆమెకు వైద్యపరీక్షలు చేశారు. పౌష్ఠికాహారం తీసుకోవాలని మందులు రాసిచ్చారు.