వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిలిపివేయాలి 

ప్రమాదంలో మాతా, శిశువు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు


ఆరోగ్యజ్యోతి, (నెట్వర్క్) :  0 నుంచి తొమ్మిది నెలల వయస్సు గల పిల్లలు ప్రమాదం లో ఉన్నారా.... గర్భిణీ స్త్రీలకు ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయా... ఆరోగ్య కార్యకర్తలు వైద్య సిబ్బంది అంగన్వాడీ కార్యకర్త ఆశ కార్యకర్త లు కరోనా వైరస్ దగ్గరకు వెళ్తున్నారా...అవును అని సమాదానం చెప్పవచు. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణలోని 33 జిల్లాలో ప్రతి బుధ శనివారాల్లో వ్యాధినిరోధకటీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం కంటిన్యూ చేస్తోంది. దీనివల్ల వీరందరూ కరోనా వైరస్ ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ప్రభుత్వం అన్నింటిపై దృష్టి పెట్టినప్పటికీ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిలిపివేస్తామని అంశంపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులు దీనిపై ఎలాంటి దృష్టిపెట్టి సాధించడం లేరు. ఎందుకంటే వీరి దృష్టి అంతా కరోనా వైరస్ పై మాత్రమే కన్నుపడింది . వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం వల్ల ఆ ప్రాంతానికి వచ్చే మాత శిశు ఆరోగ్య కార్యకర్తలు గుంపులుగుంపులుగా ఒకేచోట వస్తారు. అన్న విషయాన్ని దృష్టి సాధించలేకపోయారు. ఒకవేళ దృష్టి సారించినట్లు అయితే ఏప్రిల్ 15 వరకు ఈ కార్యక్రమాన్ని మాతా శిశు వైద్య ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు అంగన్వాడీ ప్రమాదం నుండి తప్పించుకున్న వారు అవుతారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలి లేదంటే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు



ప్రతి  బుదవారం , శనివారం రోజు ఇమ్మునైజెసన్ చేస్తున్నారు. దీని  వల్ల  ప్రమాదంలో మాతా, శిశువు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు  రిస్క్ లో ఉన్నట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ప్రతి బుధ శనివారాల్లో రోజున చిన్నారులకు గర్భవతులకు వ్యాధి నిరోధక టీకాలు ఇస్తున్నారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో డిస్టెన్స్ పాటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెపుతున్నాయి. ఈ తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం వల్ల డిస్టెన్స్ అనేది దూరం కావడం దేవుడు ఏరుగు... అంత గుంపులు గుంపులుగా చేరి  కరోన సంభావిచే  ప్రమాదం ఉంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తమకు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాధి నిరోధక టీకాలు కరోనా వైరస్ సమయంలో ఇవ్వడం వల్ల మాత శిశువు ఆరోగ్య కార్యకర్తలకు ప్రమాదం సంభవించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏప్రిల్ 15 వరకు వ్యాధినిరోధక టీకాల కార్యక్రమాన్ని నిలిపివేయాలని ప్రతి ఒక్కరు కోరుతున్నాను. వ్యాధి నిరోధక టీకాలు ఒకటి నుంచి తొమ్మిది నెలల వయసు పిల్లలు వారి అమ్మానాన్న లేక సంరక్షకుడు తీసుకొని రావడం, వారి వెంట ఒక చిన్నారి లేక ఎవరో ఒకరు రావడం, అలాగే  గర్భిణీ స్త్రీ తో సంరక్షకులు తల్లి లేదా అత్త స్నేహితులు రావడం గుంపులుగుంపులుగా ఒకే చోట కూర్చోవడం వల్ల కరోన  వైరస్ వ్యాపించే అవకాశాలు వందకు వంద శాతం ఉన్నాయి.ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఈ తరుణంలో అక్కడ ఉండేది వర్కర్ ఆరోగ్య కార్యకర్తలు వైద్య సిబ్బంది అంగన్వాడీ కార్యకర్త ఆశా మాత శిశువు సంరక్షకులకు కరుణ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేదు ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి ఏప్రిల్ 15 వరకు వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని నిలిపివేయలని కోరుతున్నాను. ఈ విధంగానే ఈ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించిన అయితే రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి ఒకరి నుంచి ఒకరి కి  కరోన వైరస్ వ్యాపించే అవకశాలు ఉన్నాయి.


ప్రభుత్వం వైద్య సిబ్బందికి వాహనాలు సమకూర్చి టీకాలు వేయవలసిన చిన్నారుల ఇంటికి వెళ్లి ఇస్తే బాగుంటుందని ప్రజలు కోరుచున్నాను