రచన ...తాటికొండ రాజేశ్వర్ (భోథ్)
అదిలాబాద్..9908119258
కరోన కట్టడి చేయండీ !వైరస్ దూరము
తరమండీ!
దగ్గు జలుబు జ్వరమండీ !డాక్టర్ సలహా
పొందండీ//కరోనకట్టడిజేయండీ//
1)విదేశి ప్రయాణ జనమండీ !ఐలెస్ లోకి
వెల్లండీ!
ప్రభుత్వ పద్దతి వినరండీ !పాటి తప్పక
నడవండీ//కరోనకట్టడిజేయండీ//
2)ముక్కు మాస్కులు గట్టండీ! పరిసర
శుభ్రత ఉంచండీ!
కూరగాయలు తడపండీ !కత్తిపీటలు
కడగండీ//కరోనకట్టడిజేయండీ//
3)చేతులు కలపక యుండండీ! నమ
స్కారముజేయండీ!
అనుమానమునూ వస్తెండీ !వందకు పోను
గొట్టండీ//కరోనకట్టడిజేయండీ//
4)జనతకర్ప్య జేయండీ! జనులా రక్షణ
పొందండీ!
జగతిమేలు జేయండీ !భారతవిలువను
పెంచండీ//కరోనకట్టడిజేయండీ//