అత్యవసర కేసులకే మినహాయింపు.. వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు, క్లినిక్‌లపై లాక్‌డౌన్ ప్రభావం పడింది. ఇంతవరకు డాక్టర్లు, ఆర్‌ఎంపీలు, పిఎంపీల ద్వారా వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రులు, క్లినిక్‌లు, పరీక్షాకేంద్రాలు, ప్రాథమిక చికిత్స అందించే వైద్య కేంద్రాలను మూసివేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అన్ని జిల్లాల కలెక్టర్లను, జిల్లా ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించింది. అత్యవసర కేసులు మినహా ఇతర వైద్య ేసవలు, అవుట్ పేషెంట్ సేవలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఉత్తర్వులు ఉల్లంఘించిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.