తెలంగాణలో ఇప్పటివరకు 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి.. వివరాలను తెలిపిన మంత్రి కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉందన్నారు. తాజాగా మరో రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులను డాక్టర్లు నిర్థారించారని చెప్పారు ఈటల రాజేందర్. దీంతో తెలంగాణ కరోనా కేసుల సంఖ్య 47కి చేరిందన్నారు. రాష్ట్రంలో వైరస్ వెలుగుచూసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు.