లక్నో(ఆరోగ్యజ్యోతి): కరోనా బారిన పడినవారి ప్రాణాలను కాపాడటంలో వైద్యునితో పాటు ప్రయోగశాలలో పనిచేసే వైద్యసాంకేతిక నిపుణుల పాత్ర కీలకమైనది. వీరు ఉత్తరప్రదేశ్ నలుమూలల నుంచి వస్తున్న నమూనాలను పరిశీలించడానికి పగలు, రాత్రి పని చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి బిఎస్ఎల్ త్రీ లాబొరేటరీలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయని కెజిఎంయు ప్రతినిధి డాక్టర్ సుధీర్ సింగ్, మైక్రోబయాలజీ విభాగం హెడ్ డాక్టర్ అమితా జైన్ తెలిపారు. కరోనా వైరస్ అనుమానంతో ఇప్పటివరకు 1250 నమూనాలను కెజిఎంయులో పరీక్షించారు. ఈ ప్రమాదకరమైన వైరస్ ను అనేక దశలలో పరిశీలిస్తారు. రీసెర్చ్ సైంటిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, లాబొరేటరీ అసిస్టెంట్ పాత్ర ఇందులో ముఖ్యమైనది. వీరంతా 42 రోజులుగా ఇంటికి వెళ్లకుండా ఆసుపత్రి లో సేవలు అందిస్తూ, ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు.