400 మంది వెనక్కి.. వంద మంది క్వారంటైన్‌కు

 చిత్తూరు : లాక్‌డౌన్‌ నేపథ్యంలో బెంగళూరు నుంచి ఆంధ్రాకు వస్తున్న దాదాపు 500 మందిని చిత్తూరు జిల్లా మదనపల్లె పోలీసులు ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు చీకిలబైలు చెక్‌పోస్టు వద్ద ఆదివారం అడ్డగించారు. వీరంతా ప్రకాశం, కృష్ణ, కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందినవారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి కరువై అక్కడనుంచి స్వస్థలాలకు బయలుదేరారు. చీకిలబైలు చెక్‌పోస్టు వద్ద పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కి పంపేశారు. దాదాపు 400 మంది తిరిగి బెంగళూరుకు వెళ్లిపోగా, వంద మంది క్వారంటైన్‌ వార్డులో ఉండేందుకు ఒప్పుకున్నారు. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నవారిని జిల్లా వైద్యశాలలోని ఐసోలేషన్‌ వార్డులో చేర్చారు.