హైదరాబాద్: కరోనా (కొవిడ్-19) నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణలో మూడు ప్రైవేటు ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ల్యాబ్‌ల సంఖ్య పెంచామని, మొత్తం 47 ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతిచ్చామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఇవాళ ప్రకటించింది. ఇందులో కొత్తగా తెలంగాణలో మూడు ఉన్నాయి. ఇప్పటికే ఐదు ప్రభుత్వ, ఐదు ప్రైవేటు ల్యాబ్‌ల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కొత్తగా మంజూరైనవి..
> పాథ్‌కేర్ ల్యాబ్స్ - మేడ్చల్
> అమెరికన్ ఇన్‌స్టిట్యూల్ ఆఫ్ పాథాలజీ & ల్యాబ్ సైన్సెస్, సిటిజన్ హాస్పిటల్ - శేరిలింగంపల్లి
> మెడిసిస్ పాథ్‌ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ - న్యూ బోయినపల్లి
ఇప్పటికే ఉన్న ప్రైవేటు ల్యాబ్‌లు
1. అపోలో హాస్పిటల్స్, జూబ్లీహిల్స్, హైదరాబాద్
2. విజయ డయాగ్నొస్టిక్స్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్, హిమాయత్ నగర్, హైదరాబాద్
3. వింతా ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, చెర్లపల్లి, హైదరాబాద్
4. అపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్, బోయిన్‌పల్లి, హైదరాబాద్
5. డా. రెమిడీస్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, పంజాగుట్ట, హైదరాబాద్
ప్రభుత్వ కరోనా పరీక్ష లేబొరేటరీలు
1. గాంధీ మెడికల్ కాలేజ్, సికింద్రాబాద్
2. ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్
3. సర్ రొనాల్డ్ రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్, హైదరాబాద్
4. నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్
5. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, హైదరాబాద్