ఒకే కుటుంబంలో 25 మందికి కరోనా


  • ఇరుకు ఇంట్లో ఉండడమే కారణం


న్యూఢిల్లీ/ముంబై, : మహరాష్ట్రలోని సాంగ్లీలో ఓ పెద్ద కుటుంబానికి చెందిన 25 మందికి కరోనా సోకింది. వారంతా ఇరుకు ఇంట్లో నివసిస్తుండడంతో వైరస్‌ వేగంగా వ్యాపించింది. సౌదీ అరేబియా నుంచి తిరిగొచ్చిన ఆ కుటుంబంలోని నలుగురు ముందుగా మహమ్మారి బారినపడినట్లు ఈ నెల 23న నిర్ధారణ అయింది. వారంలోపే మరో 21 మంది కుటుంబ సభ్యులకు కూడా వైరస్‌ సోకింది. వారిలో రెండేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఇరుకు ఇంట్లో అంతా కలిసుండడం వల్ల వారం వ్యవధిలోనే పాతిక మందికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి.