పంజాబ్ లో 33 పాజిటివ్ కేసులు నమోదు కాగా… ఓ బాధితుడు మరణించాడు. చనిపోతూ మరో 23 మందికి కరోనా వైరస్ ను అంటించాడు. చనిపోయిన వ్యక్తి భగత్ సింగ్ నగర్ జిల్లాలోని నవాన్ షహర్ కు చెందిన బల్ దేవ్ సింగ్. ఆయనో సిక్కు మత ప్రబోధకుడు. వయసు 70 సంవత్సరాలు. తన స్నేహితులతో కలిసి ఇటీవలే జర్మనీ, ఇటలీ దేశాల్లో పర్యటించాడు. భారత్ చేరుకోగానే అతడికి స్క్రీనింగ్ నిర్వహించిన అధికారులు ఇంటి దగ్గరే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. అయితే బల్ దేవ్ సింగ్ అధికారుల ఆదేశాలు పట్టించుకోకుండా 15 గ్రామాల్లో తిరగడంతో పాటు.. దాదాపు 100 మందిని కలిశాడని తెలిసింది. ఆ తర్వాత అతనికి కరోనా ముదరడంతో ఈ నెల 18న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
అంతేకాదు ఇప్పుడు ఆయన కుటుంబంలో ఏకంగా 14 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందట. పంజాబ్ లో 33 కరోనా కేసులు ఉంటే… వాటిలో 23 కేసులు ఈ వ్యక్తి ద్వారానే వ్యాప్తి చెందినట్టు గుర్తించారట అధికారులు. బల్ దేవ్ తిరిగిన 15 గ్రామాలను సీజ్ చేసి… కరోనా అనుమానితులను గుర్తించే పనిలో పడ్డారట అధికారులు.