కోల్‌కతా, మార్చి 29: చెట్టులెక్కగలవా? ఓ నరహరి పుట్టలెక్కగలవా? అని ప్రియుడికి ప్రేయసి సవాల్ చేయడం రాగయుక్తంగా విన్నాం! ఆ ఊరోళ్లేమో.. వారిని చెట్టు ఎక్కడమే కాదు.. దానిపైనే కొన్నాళ్లు ఉండండి అని హుకుం జారీ చేశారు. పశ్చిమ బెంగాల్ పురులియా జిల్లా బలరాంపూర్ గ్రామానికి ఏడుగురు కార్మికులు తిరిగొచ్చారు. కరోనా భయంతో వారిని పొలిమేరలోనే గ్రామస్థులు అడ్డుకున్నారు. సెల్ఫ్ క్వారంటైన్ కోసం చెట్టెక్కి.. దాని మీదే 14రోజులు ఉండండి, లేదంటే వెళ్లిపోండి అన్నారు. తప్పదన్నట్లుగా ఆ ఏడుగురూ చెట్ల కొమ్మలకు మంచాలను కట్టుకొని వాటిమీదే ఉంటున్నారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు, భోజనం చేసేందుకు రోజుకు 3సార్లు కిందకి దిగేందుకు అనుమతిచ్చారు. ఇళ్లలో సరిపడా స్థలం లేకపోవడంతోనే చెట్లమీద ఉంటున్నారని స్థానిక ఎమ్మెల్యే పేర్కొన్నారు.