డీసీసీబీ డైరెక్టర్‌ను సన్మానించిన మంత్రి అల్లోల


 




 


మామడ : మండలంలోని పోన్కల్‌ గ్రామానికి చెందిన మామడ పీఎసీఎస్‌ చైర్మన్‌ హరీష్‌ రావు జిల్లా సహకార బ్యాంక్‌ డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆయనను రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, దివాకర్‌రావు, బాబురావు, ఎంఎల్‌సీ సతీష్‌, తదితరులు ఆదిలాబాద్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని కోరారు.